బీజేపీని గద్దె దించుడే లక్ష్యం..

బీజేపీని గద్దె దించుడే లక్ష్యం..
కేంద్రంలోని బీజేపీని గద్దే దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న విపక్షాలు.. ఉమ్మడి భేటీకి కొత్త తేదీ ఫిక్స్ చేశారు

కేంద్రంలోని బీజేపీని గద్దే దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న విపక్షాలు.. ఉమ్మడి భేటీకి కొత్త తేదీ ఫిక్స్ చేశారు. ఈనెల 23న పాట్నాలో ఐక్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో వ్యూహాన్ని రూపొందించేందుకు తొలుత ఈ నెల 12న పాట్నాలో భేటీ కావాలని నిర్ణయించారు. అయితే డీఎంకే, కాంగ్రెస్ సహా పలు పార్టీల విజ్ఞప్తి మేరకు వాయిదా వేశారు.

ఈనెల 23న జరిగే ఈ కీలక భేటీకి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఆప్‌ చీఫ్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు అంగీకరించినట్టు తేజస్వీ యాదవ్ తెలిపారు. అలాగే బీజేపీయేతర పార్టీల నుంచి అనేకమంది నేతలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. మరి.. ఢిల్లీలో మారుతున్న రాజకీయ పరిణామాలతో ఈ ఉమ్మడి సమావేశానికి ఏఏ పార్టీలు వస్తాయి? కలిసొచ్చే నేతలెవరు? విపక్షాల ఉమ్మడి ఎజెండా ఎలా ఉండబోతుంది? జూన్ 23న ఎలాంటి వ్యూహాన్ని ప్రకటిస్తారు? అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story