కన్ఫ్యూజన్‌లో కమళ దళపతి..?

కన్ఫ్యూజన్‌లో కమళ దళపతి..?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ బరిలో దిగుతారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల్లో టెన్షన్ మొదలయిందా? అసెంబ్లీకి పోటీ చేయాలా లేదంటే పార్లమెంట్ కే పోటీ చేయాలా? అనే సస్పెన్స్‌లో ఉన్నారా ఒకవేళ అసెంబ్లీకి పోటీచేద్దామన్నా ఎక్కడనుండి బరిలో దిగాలో తేల్చుకోలేకపోతున్నారా?

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ బరిలో దిగుతారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంజయ్.. శాసన సభ ఎన్నికల్లో పోటీ పడడం ఖాయమేనన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. మరోవైపు కరీంనగర్‌ ఎంపీ స్థానం నుండి కూడా పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందు అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అసెంబ్లీ బరిలో దిగాలని అయన అనుచరవర్గం కోరుతున్నట్లు సమాచారం.

సార్వత్రిక ఎన్నికలకంటే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో తాను పోటీ చేసిన కరీంనగర్ నుంచి కాకుండా మరో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అందుకే గత కొంతకాలం నుంచి ఆయన వేములవాడపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడి నేతలతో ఆయన తరచుగా సమావేశమవుతున్నారని సమాచారం. ఇప్పటికే కరీంనగర్ లో బూత్ లెవెల్ సర్వేలు సైతం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హిందూ ఏక్తా యాత్రను ఈ సంవత్సరం ఆర్భాటంగా నిర్వహించినట్లు క్యాడర్‌లో చర్చనడుస్తోంది. కరీంనగర్ క్యాడర్‌తో పాటు, వేములవాడ క్యాడర్ కూడా ఎక్కువగా సమీకరించి సక్సెస్ అయినట్లు పబ్లిక్‌లో చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే బీజేపీ నిర్వహించే ఏ కార్యక్రమమైనా కరీంనగర్ పార్లమెంట్‌, వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని పబ్లిక్‌లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు వేములవాడ నియోజకవర్గం నుండి మాజీ గవర్నర్ తనయుడు వికాస్ రావు బరిలో నిలిచే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జూన్ లో అమిత్ షా టూర్‌ ప్రోగ్రాంను వేములవాడలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయట బీజేపీ శ్రేణులు. చెన్నమనేని బలమైన నేతగా ఉండటం కుమారుడ్ని పార్టీలో చేర్చడం పక్కనే ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ కు సవాల్ విసరొచ్చని బీజేపీ శ్రేణులు అంచనావేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే గత రెండు సంవత్సరాల కాలంగా చెన్నమనేని వికాస్ రావు స్వచ్చంద సంస్థ పేరిట ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మహిళలకు కుట్టుమెషీన్ల పంపిణి తో పాటు పలు గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. వేములవాడ నుండి వికాస్ రావుకి టికెట్ కన్‌ఫర్మ్‌ అయితే కరీంనగర్ నుండి పోటీ చేయొచ్చనే భావనలో ఉన్నారట బండి సంజయ్. అయితే అమిత్ షా పర్యటన అనంతరం పార్టీ నేతలతో చర్చించి బండి సంజయ్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story