ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్

ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్
X

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఎల్ వీఎంహెచ్ అధినేత, ఫ్రెంచ్ దేశస్థుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను మస్క్ వెనక్కి నెట్టారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొని విలాసవంతమైన వస్తువులకు పెట్టింది పేరైన ఎల్‌వీఎంహెచ్‌ సంస్థ షేర్ విలువ పారిస్ ట్రేడింగ్‌లో 2.6 శాతం తగ్గింది.

మొన్నటివరకు టాప్ లో ఉన్న ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ కు చెందిన ఎల్వీఎంహెచ్ షేర్లు.. 2.6 శాతం పతనం కావడంతో మస్క్ తిరిగి నెంబర్ 1 స్థానానికి దూసుకొచ్చారు. బ్లూంబర్గ్ టాప్ 500 సంపన్నుల జాబితాలో మొదటి స్థానం కోసం ఏడాదిగా మస్క్, బెర్నార్డ్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. గతంలో నెంబర్ 1 గా ఉన్న మస్క్ ను గతేడాది డిసెంబర్ లో బెర్నార్డ్ అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. కానీ ఇప్పుడు మళ్లీ మస్క్ తన స్థానాన్ని తిరిగి చేజిక్కించుకున్నారు. బెర్నార్డ్ స్థాపించిన ఎల్వీఎంహెచ్ కు లూయిస్ వ్యూటన్, ఫెండి, హెన్నెసీ వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఆర్థిక వృద్ధి మందగిస్తున్న కారణంగా ఈ ప్రభావం లగ్జరీ సెక్టార్ పై పడింది. దీంతో చైనా సహా ఇతర దేశాల్లో బెర్నార్డ్ కు చెందిన బ్రాండ్లపైనా ప్రభావం పడింది. ఈ కారణంగా ఏప్రిల్ లో ఎల్వీఎంహెచ్ షేర్లు 10 శాతం క్షీణించాయి. ఫలితంగా బెర్నార్డ్ సంపద ఒక్కరోజులోనే 11 బిలయన్ డాలర్లు పతనమైంది.

మరో వైపు మస్క్ సంపద ఈ ఏడాది 55.3 బిలియన్ డాలర్లు పెరిగింది. టెస్లా షేర్లు విలువ ఈ ఏడాది భారీగా వృద్ది చెందడంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం మస్క్ సంపద 192.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయన తర్వాతి స్థానంలో ఉన్న బెర్నార్డ్ సంపద 186.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

Tags

Next Story