Real Estate: ఒమిక్రాన్ సమయంలోనూ ఓన్ హౌస్ గురించే నగరవాసి ఆలోచన..

Real Estate: వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇరుకు గదుల్లో ఇంటి నుంచి పని చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటే కాస్త వెసులుబాటుగా ఉంటుందని భావిస్తున్నారు ఐటీ ఉద్యోగులు.. సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు ఇదే తగిన సమయమని భావిస్తున్నారు నగరంలో నివసిస్తున్న యువత.
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలతో పోలిస్తే భాగ్యనగర వాసులు స్థిరాస్థి రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నా 2011 తర్వాత 2021లోనే అత్యధిక ఇళ్లు అమ్ముడయ్యాయని రియాల్టీ మార్కెట్ చెబుతోంది. గత ఏడాది ఇక్కడ మొత్తం 24,312 ఇళ్లు అమ్ముడయ్యాయని తెలిపింది. 2020తో పోలిస్తే 142 శాతం ఇళ్ల కొనుగోలులో వృద్ధిని సాధించిందని పేర్కొంది. 2021 జూలై నుంచి ధరలు కూడా 5 శాతం మేరకు పెరిగాయి.
రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఇళ్లపై వెచ్చిస్తున్నారు. ఇలాంటి ఇళ్ల విక్రయాలు 48 శాతానికి పైగా ఉన్నాయి. ఇక రూ. కోటికి మించిన ఇళ్ల అమ్మకాలు గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయి. ఇక అధిక డిమాండ్ ఉన్న ఏరియాలుగా కోకాపేట్, పటాన్ చెరు, గోపన్నపల్లి, నల్లగండ్లలో స్థిరాస్థి అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com