Hyderabad: మగువలకు భాగ్యనగరమే ది బెస్ట్...!

Hyderabad: మగువలకు భాగ్యనగరమే ది బెస్ట్...!
మహిళలకు అత్యంత సౌఖ్యమైన నగరంగా హైదరాబాద్; అవతార్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడి; 200 నివేదికల ఆధారంగా నగరాలకు ర్యాంకింగ్

Hyderabad: మహిళలకు అన్ని విధాలుగా అత్యంత అనుకూలంగా ఉన్న నగరాల్లో మన హైదరాబాద్ టాప్ 5లో స్థానం దక్కించుకుంది. ఓ ఏడాది పాటు జరిపిన సర్వే అనంతరం అవతార్ సంస్థ విడుదల చేసిన నివేదిక ఆధారంగా మన భాగ్యనగరి అరుదైన గౌరవం దక్కించుకుంది. లివింగ్ ఇండెక్స్, PLFS, జాతీయగణాంకాలు, క్రైమ్ రికార్డులు, NFHS, మహిళా-శిశు సంక్షేమ శాఖ వార్షిక నివేదిక, IMF తదితర విభాగాల నుంచి సేకరించిన నివేదికల ఆధారంగా సర్వే నిర్వహించినట్లు అవతార్ సంస్థ తెలిపింది.


తాజా సర్వే ప్రకారం చెన్నై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, ముంబై... మగువలకు అత్యంత సౌకర్యవంతమైన నగరాలుగా నిలిచాయి. మొత్తంగా 111 నగరాలను కాచి వడబోయగా కేవలం 9 నగరాలు మాత్రమే సిటీ ఇంక్లూషన్ స్కోర్ లో 60కి 50 మార్కు దాటాయని తెలుస్తోంది. ఏన్నో రాష్ట్ర రాజధానులు కనీసం 25 స్కోర్ కూడా దాటలేకపోయాయని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ మాత్రం అత్యంత నాణ్యమైన మౌలిక సదుపాయాలతో టాప్ ప్లేస్ ను కైవసం చేసుకుంది.


మరోవైపు రాష్ట్ర రాజధానులు... రాజకీయ, సామాజిక, పర్యావరణ, అభివృద్ధి అంశాలను దృష్టిలో ఉంచుకుని తమ పాలసీల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అవతార్ సంస్థ తెలిపింది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, ఈ విషయంలో యావత్ దక్షిణాది మగువల మనగడకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నివేదిక తమని ఆశ్చర్యానికి గురిచేయడంలేదని అవతార్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.సౌందర్యా రాజేశ్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో మహిళా ఉద్యోగులకు స్నేహపూరిత వాతావరణం ఉంటుందని, దీనికి ఈ ప్రాంతాల రాజకీయ-చారిత్రక నేపథ్యం కూడా దోహదపడుతోందని వెల్లడించారు.


అవతార్ నివేదిక వెల్లడించిన విషయాలు..

- పదిలక్షలకు పైగా జనాభా ఉన్న టాప్ 25 నగరాల్లో ఉన్న చెన్నై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, విశాఖపట్నం, కోల్ కతా, కొయంబత్తూర్, మధురై టాప్ 10లో నిలిచాయి.

- పదిలక్షలకు తక్కువ జనాభా ఉన్న 25 నగరాల్లో తిరుచిరాపల్లి, వెల్లూర్, ఈరోడ్, సేలమ్, తిరుపూర్, పుదుచ్చేరి, సిమ్లా, మంగళూరు, తిరువనంతపురం, బెలగావి టాప్ 10లో నిలిచాయి.

- ఉత్తరాదిన ఢిల్లీ, శ్రీనగర్, అమృత్‌సర్ అక్కడి టాప్ 3 క్యాటగిరీలో నిలిచాయి.

Tags

Read MoreRead Less
Next Story