Sania Mirza: విడాకులపై క్లారిటీ ఇచ్చినట్లేనా..!?

Sania Mirza: విడాకులపై క్లారిటీ ఇచ్చినట్లేనా..!?
కొంతకాలంగా సానియా-షోయబ్ విడాకులపై సాగుతున్న చర్చ, క్లారిటీ ఇవ్వని జంట, క్రిప్టిక్ పోస్టులతో తికమక

ప్రపంచంతో ఓ చిన్నపాటి యుద్ధమ చేసి.. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను మనువాడి దుబాయ్ లో సెటిల్ అయిన హైదరాబాదీ బ్యూటీ సానియా మిర్జా కొంతకాలంగా కొడుకుతో సహా తల్లిగారి ఇంటే ఉంటోన్న సంగతి తెలిసిందే. దీంతో జనాలకు అనుమానం రానే వచ్చింది. షోయబ్ తో అమ్మాయి తెగదెంపులు చేసుకుందనే ముచ్చట ఆ నోటా ఈ నోటా పాకి మస్త్ వైరల్ అయింది.

ఇక ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చేందుకు ఇరువురూ ముందుకు రాలేదు. దీంతో ఇదే నిజమవ్వబోతోందని అంతా భావించారు. అయితే, న్యూ ఇయర్ సందర్భంగా సానియా సోషల్ మీడియా పెట్టిన ఓ పోస్ట్ తో విడాకుల ముచ్చట నిజమేనని అర్ధమవుతోంది.

కొన్ని సెల్ఫీలను పోస్ట్ చేసిన సానియా 2022లో కొన్ని సందర్భాలు అత్యంత క్లిష్టంగా గడిచాయని, అయినా ఈఏడాదికి రుణపడి ఉంటానని పేర్కొంది. దీంతో పాటూ నిజాన్ని మీరు భరించలేరు అన్న హ్యాష్ ట్యాగ్ ఇవ్వడంతో ఈ క్రిప్టిక్ పోస్ట్ వెనుక మర్మమేంటో అర్థంకాక జనాలు బుర్రగోక్కుంటున్నారు.

ఏమైనా నెటిజెన్లు మాత్రం ఈ పోస్ట్ విడాకుల పుకార్లను బలోపేతం చేస్తోందని అంటున్నారు. కొందరు సూటిగా సుత్తిలేకుండా చెప్పేయవచ్చుకదా అని రిక్వెస్ట్ చేస్తుంటే.. మరి కొందరు ఆమెకు మరింత బలం చేకూరాలని సందేశాలను పంపారు.

ఎన్నో ఒడిదుడుకుల మధ్య 2010లో షోయబ్ ను మనువాడింది సానియా. వీరిద్దరికీ ఓ బాబు ఉన్నాడు. పాకిస్థానీ నటి ఆయేషాతో సాన్నిహిత్యం వల్లే షోయబ్, సానియా నడుమ విభేధాలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story