చనిపోయాడు అనుకున్న వాడు ప్రాణాలతో దొరికాడు

చనిపోయాడు అనుకున్న వాడు ప్రాణాలతో దొరికాడు
యువ మౌంటెనీర్ సాహస గాథ

రెండు రోజుల క్రితం మౌంట్ అన్నపూర్ణ శిఖరంపై గల్లంతు అయిన భారత శిఖర ఆరోహకుడు అనురాగ్ మలూ ఆచూకీ లభించింది. సోమవారం మలూ అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించి బేస్ క్యాంప్ నాలుగు నుంచి మూడుకు తిరిగి వస్తుండగా అతడి అచూకీ గల్లంతైన సంగతి తెలిసిందే. దీంతో అతడు మరణించి ఉంటాడని అందరూ భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం మలూ ప్రాణాలతోనే ఉన్నారని తెలిసింది. రాజస్థాన్ కు చెందిన వ్యాపారవేత్త అనురాగ్ మలూ ప్రాణాలతోనే లభించినప్పటికీ అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అతడి సోదరుడు తెలిపాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోందని స్పష్టం చేశాడు. శిఖర ఆరోహణలో తర్ఫీదు పొందిన అనురాగ్ మలూ ఇప్పటికే పలు ఎత్తైన శిఖరాలను అధిరోహించారు. ఈ ఏడాది నేపాల్ లోని ఎత్తైన మౌంట్ అన్నపూర్ణతో పాటూ, లోట్సే, మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కేందుకు ప్రణాళికలు వేసుకున్నాడు.Tags

Read MoreRead Less
Next Story