మోదీ తాతా జర మా స్కూల్ సంగతి చూడరాదు...!

మోదీ తాతా జర మా స్కూల్ సంగతి చూడరాదు...!
చిన్నారి వీడియోకు అనూహ్య స్పందన

తమ పాఠశాలలో విద్యార్ధులకు కనీస సౌకర్యాలు కూడా లేవని ఫిర్యాదు చేస్తూ ఓ చిన్నారి వీడియో వైరల్ గా మారడంతో హుటాహుటిన సదరు పాఠశాల పునర్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. జమ్ములోని కతువా ప్రాంతంలో ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న చిన్నారి సీరత్ నాజ్ స్కూల్ ఆవరణలో ఓ వీడియో ద్వారా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఓ వీడియో చేసింది. మోదీ జీ మా స్కూల్ పరిస్థితి చూడండి అంటూ తమ కష్టాలను చెప్పుకొచ్చింది. ఈ వీడియో కాస్తా జాతీయ స్థాయిలో వైరల్ గా మారడంతో జమ్మూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ రవిశంకర్ హుటాహుటిన స్కూల్ ను సందర్శించారు. అక్కడి పరిస్థితులు స్వయంగా పర్యవేక్షించి స్కూల్ పునర్ నిర్మాణానికి తొలి విడతగా రూ. 91లక్షలు మంజూరు చేశారు. ప్రస్తుతం పాఠశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏమైనా ఒక్క వీడియోతో వ్యవస్థను మార్చి పారేసిన శీరత్ నాజ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story