ప్రభుత్వ బాధ్యతా రాహిత్యంతో భక్తులకు ఇబ్బందులు : చంద్రబాబు

ప్రభుత్వ బాధ్యతా రాహిత్యంతో భక్తులకు ఇబ్బందులు : చంద్రబాబు

సింహాద్రి అప్పన్న స్వామి భక్తుల ఇబ్బందులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యంతోనే భక్తులకు ఇబ్బందులంటూ ట్వీట్‌ చేశారు. చందనోత్సవంలో భక్తుల ఇబ్బందులు తనను బాధ కల్గించాయ న్నారు చంద్రబాబు. దశాబ్దాలుగా లేని ఇబ్బందులు, రాని సమస్యలు పుణ్య క్షేత్రాల్లో ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటూ ప్రశ్నించారు. దేవ స్థానాలను వివాద కేంద్రాలుగా మార్చడం తప్ప... ప్రభుత్వం, అధికారులు ఏం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

Read MoreRead Less
Next Story