మరో రెండు రోజులు వర్షాలు కుమ్మేస్తాయట

మరో రెండు రోజులు వర్షాలు కుమ్మేస్తాయట
ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

నగరంలో మరో రెండు రోజుల పాటూ వర్షాలు గట్టిగానే పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ తో పాటూ తెలంగాణాలోని ఇతర ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. చార్మినార్, ఖైర్తాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, సెరిలింగంపల్లిలో సాయంత్రం లేదా రాత్రుల్లో సాధారణ వర్షపాతం నమోదవుతాయని తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీమ్ నగర్, సిద్ధిపేట్, రంగారెడ్డి మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబుబ్ నగర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.



Tags

Next Story