తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. చాలా జిల్లాల్లో నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యప్రతాపం మొదలవుతోంది. సాయంత్రం ఏడు దాకా వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.. ఉదయం పది గంటలు దాటితే జనం ఇంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. మధ్యాహ్నం పూట వీస్తున్న వడగాల్పులకు పిల్లల నుంచి పెద్దల దాకా.. అందరూ భయపడిపోతున్నారు. కూలర్లు, ఏసీలు ఆన్‌ చేసుకుని సేదదీరుతున్నారు. ఉదయం 11 తర్వాత ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం ఆరు తర్వాతే బయట కాలు పెట్టాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో సైతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యభగవానుడి ప్రతాపంతో జనం బయటకు రావాలంటనే భయంతో వణికిపోతున్నారు. వేసవి తీవ్రతతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు ఉక్కపోతతో నరగవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతోంది. దీంతో ఇంట్లో నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు ప్రజలు.

Next Story