తమిళనాడు మంత్రిపై ఐటీ దాడులు

తమిళనాడు మంత్రిపై ఐటీ దాడులు

తమిళనాడులోని ఓ మంత్రిపై ఐటీ దాడులు జరిగాయి. విద్యుత్, ఎక్సైజ్ మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటిపైన, బంధువుల ఇళ్ళు, కార్యాలయాలపై మొత్తం 100చోట్ల ఏకకాలంగా ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 34 జిల్లాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కరూర్ మాఫియా పేరుతో ఏకంగా తమిళనాడు రాష్ట్రంలో ఎమ్మార్పీ రేట్లు ఉన్న మద్యం బాటిల్స్‌పై 10రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆదాయపు పన్నును గత 5సంవత్సరాలుగా మంత్రి చెల్లించలేదు. దీంతో ఆదాయపు,పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. అయితే పలుచోట్ల డీఎంకే కార్యకర్తలు ఆదాయపు పన్ను శాఖ అధికారులను అడ్డుకున్నారు. బిజెపి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని డీఎంకే కార్యకార్తలు ఆరోపిస్తున్నారు.

Read MoreRead Less
Next Story