అమెరికాలో రుణ సంక్షోభానికి తెర

అమెరికాలో రుణ సంక్షోభానికి తెర

అమెరికాలో రుణ సంక్షోభానికి తెర పడింది. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్‌ రేపిన ఈ సంక్షోభంపై అధికార, విపక్షాల మధ్య రాజీ కుదిరింది. దీంతో నిన్న రాత్రి అమెరికా ప్రజా ప్రతినిధుల సభ 314-117 ఓట్లతో ఆమోదించింది. రుణ పరిమితి బిల్లుకు ఆమోదం లభించకపోతే... ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ ఆగిపోతాయి. దీంతో రుణ పరిమితి బిల్లును ఆమోదించేందుకు దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రజా ప్రతినిధుల సభ ఆమోదం తరవాత రుణ పరిమతి బిల్లు సెనేట్‌ ఆమోదానికి వెళ్ళనుంది. సెనేట్‌ ఆమోదం తరవాత ఈ బిల్లుపై అధ్యక్షుడు బైడెన్‌ సంతకం చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 5వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

Read MoreRead Less
Next Story