ఏపీలో కూటమి హవా, వైకాపాకు దక్కని ప్రతిపక్ష హోదా

ఏపీలో కూటమి హవా,  వైకాపాకు దక్కని ప్రతిపక్ష హోదా
X

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కే ప‌రిస్థితి లేదు. మొత్తం అసెంబ్లీ సీట్ల‌లో క‌నీసం ప‌ది శాతం సీట్ల‌ను ద‌క్కించుకుంటేనే ప్ర‌తిప‌క్ష హోదాకు అర్హ‌త సాధించారు. ఈ లెక్క ప్ర‌కారం వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కే అవ‌కాశాలు లేవు. ప్ర‌స్తుతానికి వైసీపీ అతి తక్కువ స్థానాల్లో ఆధిక్య‌త క‌న‌బ‌రుస్తోంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 18 సీట్లు ఉన్న పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా వుంటుంది. దీంతో ఏపీ అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడ‌ని కూడా జ‌గ‌న్ పిలిపించుకునే ప‌రిస్థితి లేదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా జ‌న‌సేన‌కు ద‌క్కుతుంది. ఎందుకంటే ఆ పార్టీ ప్ర‌స్తుతం 20 అసెంబ్లీ స్థానాల్లో ముందంజ‌లో వుంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ‘వార్‌ వన్‌ సైడ్‌’ అన్నట్లుగా కూటమి దుమ్ములేపింది. జగన్‌ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. కూటమికి ఘన విజయం కట్టబెట్టారు. ఇప్పటికే 117 స్థానాల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులు.. మరో 17 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైకాపా కంటే మెరుగ్గా జనసేన సొంతంగానే 21 స్థానాల్లో గెలుపొందింది. మొదటినుంచి ఫలితాల సరళి చూసి వైకాపాకు ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా? అని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం కాగా.. చివరకు అదే నిజమైంది.

Next Story