నిమిషానికి 137మంది బిర్యానీ లాగించేస్తున్నారట; ఆ తరువాత మసాలా దోశకే ఓటు

నిమిషానికి 137మంది బిర్యానీ లాగించేస్తున్నారట; ఆ తరువాత మసాలా దోశకే ఓటు
X
ఫుడ్ ఎగ్రిగేటర్లలో బిర్యానికి వెల్లువెత్తుతున్న ఆర్డర్లు, నిమిషానికి వందకు పైగా ఆర్డర్లు.

బిర్యానీ అంటే ఒకానొక సమయంలో పండగలకో పబ్బాలకో, లేదంటే సరదాగా ఇంటిల్లపాదీ బయటకు వెళ్లినప్పుడు అలా హోటల్ లో భోంచేయాలనుకున్నప్పుడు మాత్రమే లభించే ఓ రుచికరమైన వంటకం. క్రమంగా హోటల్ ఫుడ్ కు అలవాటు పడ్డ జనం బిర్యానీని తమ మెనూలో రెగ్యులర్ ఐటమ్ గా మార్చేసుకున్నారు. ఇక ఫుడ్ ఎగ్రిగేటర్ల పుణ్యమాని ఒక్క క్లిక్ తో రుచికరమైన బిర్యానీ మన ముందు ఉంటోంది. దీంతో మనోళ్లు బిర్యానీని తెగ లాగించేస్తున్నారట.


హైదరాబాదీ దమ్ బిర్యానీ, తలసెరి బిర్యానీ, లక్నోవీ బిర్యానీ పేరు ఏదైనా నిమిషానికి 137మంది భారతీయులు బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినేస్తున్నారట. ఓ ప్రముఖ ఫుడ్ ఎగ్రిగేటర్ విడుదల చేసిన డేటా ప్రకారం బిర్యానీకి మాత్రమే అత్యంత భారీ ఆర్డర్లు లభించాయట. ఏమైతేనేమి ఈ మొఘల్ వంటకానికి ఉన్న డిమాండ్ మాత్రం రోజు రోజుకూ పెరుగుతోందే తప్ప తరగడంలేదు. ఏడేళ్లుగా బిర్యానీకే భోజన ప్రియులు పట్టంకడుతున్నారంటే ఆ వంటకానికి నెలకొన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.


ఇక బిర్యానీ తరువాత మసాలాదోశకు ఎక్కువ ఆర్టర్లు వస్తున్నాయట. ఆ తరువాతి స్థానాల్లో పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెబ్ బిర్యానీ నిలిచాయి. ఇక అంతర్జాతీయ వంటకాలనూ మనోళ్లు విడిచిపెట్టడంలేదు. సుషీ, మెక్సికన్ బౌల్స్, రేమెన్, పాస్తాకు మంచి గిరాకీ ఉందని తెలుస్తోంది. స్నాక్స్ విషయానికి వస్తే సమోసా, పాప్ కార్న్, పావ్ బాజీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ను తెగ ఆర్డర్ చేస్తున్నారట. స్వీట్స్ విషయంలో గులాబ్ జామున్, రస్ మలై, రసగుల్లాకు ఎక్కువ డిమాండ్ నెలకొంది.

Tags

Next Story