మే 27న పీటీడీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మహాసభలు

మే 27న పీటీడీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మహాసభలు

ఈనెల 27న పీటీడీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మహాసభలు జరగనున్నాయి. దీనికి సంబందించిన పోస్టర్‌ విడుదల చేశారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని,చాయ్‌ బిస్కట్‌ సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు బొప్పరాజు.ప్రధాన ఆర్థిక డిమాండ్లపై సీఎస్‌ను కలిశామని, 4 డీఏలను ఎప్పుడు ఇస్తారో చెప్పాలని కోరామన్నారు.కొత్త పీఆర్సీ రికమండెట్ పేస్కేళ్లు బయటపెట్టి,12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని కూడా సీఎస్‌కు చెప్పామన్నారు బొప్పరాజు.ఇదే అంశంపై ఇవాళ రాత్రి 7 గంటలకు అన్ని సంఘాలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నామన్నారు.

Read MoreRead Less
Next Story