నేను వారిని నమ్ముకున్నా: కీరవాణి
ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్ గ్లోబ్' అవార్డును సొంతం చేసుకుని 'ఆర్ఆర్‌ఆర్' చరిత్ర సృష్టించింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొని 'నాటు నాటు' పాటకు ఈ అవార్డును దక్కించుకుంది. ఇవాళ కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో అతిథుల హర్షధ్వానాల మధ్య సంగీత దర్శకుడు కీరవాణి అంగోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కీరవాణి అన్నారు.దుకున్నారు. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్‌తో పాటు కీరవాణి కుటుంబం కూడా ఈ ఉత్సవంలో పాల్గొంది. అవార్డు తీసుకున్న తరవాత కీరవాణి మాట్లాడుతూ.. గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సంతోష సమయాన్ని సతీమణితో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. నిజానికి నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలని అన్నారు. తన శ్రమను, తనకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాననని కీరవాణి అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com