మూడు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులు..హైకోర్టు కీలక ఉత్తర్వులు

మూడు జిల్లాలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పలువురు అదనపు జిల్లా జడ్జిలను కొత్త స్థానాలకు బదిలీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న గంధం సునీత.. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా నియమితులయ్యారు. హైకోర్టు రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ఆలపాటి గిరిధర్ విశాఖపట్నం పీడీజేగా బదిలీ అయ్యారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తిని కడప జిల్లా పీడీజేగా నియమించారు. విశాఖ పీడీజేగా పనిచేస్తున్న జి.గోపిని విశాఖలోని ఏపీ వ్యాట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా బదిలీ చేశారు. అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో హత్యాయత్నం కేసును విచారిస్తున్న విజయవాడ ఎంఎస్‌జే కోర్టు.. రెండో ఏడీజే న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయమూర్తి కడపకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడ మూడో ఏడీజే కోర్టు జడ్జి ఎ.సత్యానంద్ వచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com