బీజేపీ, కాంగ్రెస్ లపై కేటీఆర్ ఫైర్

బీజేపీ, కాంగ్రెస్ లపై కేటీఆర్ ఫైర్

మహబూబ్‌నగర్‌ సభలో బీజేపీ, కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలకు ఎన్నికల సమయంలోనే దేవుడు గుర్తుకొస్తాడని చురకలంటించారు. గుజరాత్ చెప్పులు మోసేటోల్లు కావాలా.. పౌరుషమున్న తెలంగాణ బిడ్డలు కావాలా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు.. కానీ తెలంగాణలో రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ అంటే.. కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు అని నిర్వచించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పైనా కేటీఆర్‌ సెటైర్లు వేశారు. ఆయన పిచ్చోడో.. మంచోడో ఎవరికీ తెలియదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Tags

Next Story