కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..!

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..!

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన 18మంది.. కర్నాటకలోని కలబురిగి దర్గా ఉరుసు ఉత్సవాలకు జీపులో వెళ్లారు. ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా.. యాదగిరి జిల్లాలో తెల్లవారుజామున ఆగివున్న లారీని జీపు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జీపులోని 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read MoreRead Less
Next Story