లాభాల్లో దూకుడు చూపిస్తోన్న LIC

లాభాల్లో దూకుడు చూపిస్తోన్న LIC

దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ లాభాల్లో దూకుడు చూపిస్తోంది.. ఈ ఆర్థిక సంవత్సరం 36 వేలా 397 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫలితాలను ఎల్‌ఐసీ సంస్థ ప్రకటించింది.. గత ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో లాభం దాదాపుగా 9 రెట్లు పెరిగింది.. ఇక మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి 13 వేలా 191 కోట్ల నికర లాభాన్ని సంస్థ ఆర్జించింది.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోల్చితే లాభాలు ఐదింతలు పెరిగాయి.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 2,409 కోట్లు ఉండగా.. ఈసారి 13 వేలా 191 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.. అంటే ఈ తొంబై రోజుల్లో కంపెనీ ప్రతి సెకనులో దాదాపు 17వేల రూపాయల లాభం ఆర్జించింది.. మరోవైపు పది రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మూడు రూపాయల డివిడెండ్‌ను కంపెనీ సిఫార్సు చేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత విభాగంలో 2 కోట్ల 4 లక్షల బీమా పాలసీలు విక్రయించినట్లుగా సంస్థ తెలిపింది.

Next Story