షార్ట్ సర్క్యూట్.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం

షార్ట్ సర్క్యూట్.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం
X
షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ముంబైలోని ఏడుగురు కుటుంబ సభ్యులు మరణించారు.

గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రికల్ వస్తువులను ఉంచే దుకాణంలో మంటలు వ్యాపించాయి, అవి కాస్తా పై ​​అంతస్తుకు కూడా వ్యాపించడంతో అందులో నివసిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కుటుంబసభ్యులు మృతి చెందారు.

ఈరోజు ముంబైలోని రెండంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు.

చెంబూరులోని సిద్ధార్థ్‌ కాలనీలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులను పారిస్ గుప్తా, 7, నరేంద్ర గుప్తా, 10, మంజు ప్రేమ్ గుప్తా, 30, అనితా గుప్తా, 39, ప్రేమ్ గుప్తా, 30, విధి గుప్తా, గీతా గుప్తాగా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.


Tags

Next Story