ప్రియురాలి ఫోటోలు దొంగిలించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బెస్ట్ ఫ్రెండ్‌ని చంపేసిన యువకుడు

హత్య గావింపబడిన యువకుడు అభినవ్ మరియు నిందితులు వరుసగా 11, 12 తరగతుల విద్యార్థులు, ఇరుగు పొరుగు ఇళ్ల వారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో తన సన్నిహితుడిని కొట్టి చంపినందుకు 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడు అభినవ్ తన ఫోన్ నుండి తన స్నేహితురాలి ఫోటోలు, వీడియోలను దొంగిలించాడని, ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అందుకే అతడిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు.
ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇద్దరు స్నేహితులు వారి ఇళ్ల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోచింగ్ సెంటర్‌కు కలిసి వెళ్లేవారు. అభినవ్ తన స్కూటర్ పై స్నేహితుడిని ఎక్కించుకుని వెళ్లేవాడు.
వీరిద్దరూ శనివారం కోచింగ్ క్లాస్‌కు వెళ్లారు. కానీ సాయంత్రం అయినా అభినవ్ తిరిగి రాలేదు. నిందితుడిని అతని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. అభినవ్ ఎక్కడున్నాడో తనకు తెలియదని చెప్పాడు. అభినవ్ తండ్రి సునీల్ కుమార్ ఆ రాత్రి మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసి నిందితుడిని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
పోలీసులు నిందితులను పట్టుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు యువకులు కలిసి ఉన్నట్లు గుర్తించారు. విచారణలో అభినవ్‌ను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.
తన ఫోన్‌లో ప్రియురాలి వీడియోలు ఉన్నాయని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అభినవ్ ఆ వీడియోలను చూసి తన ఫోన్‌కు బదిలీ చేసుకున్నాడని చెప్పాడు. అభినవ్ తన స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ విషయం ప్రియురాలు చెప్పడంతో అభినవ్ హత్యకు పథకం వేశాడు నిందితుడు.
శనివారం నిందితుడు తన ఫోన్‌ను విక్రయించాలనుకుంటున్నట్లు అభినవ్‌కు చెప్పాడు. ఇద్దరూ ఓ దుకాణానికి వెళ్లి ఫోన్‌ను రూ.8 వేలకు విక్రయించారు. అనంతరం ఓ రెస్టారెంట్‌లో భోజనం చేశారు. తిరిగి వస్తుండగా ఓ బావి దగ్గర ఆగారు. సడెన్ గా బ్యాగులోంచి సుత్తి తీసి అభినవ్ తలపై నిందితుడు కొట్టాడు. దాంతో అభినవ్ ప్రాణాలు కోల్పోయాడు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని
నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com