యూట్యూబ్ ఛానళ్లపై కోర్టుకెక్కిన ఆరాధ్యాబచ్చన్

యూట్యూబ్ ఛానళ్లపై కోర్టుకెక్కిన ఆరాధ్యాబచ్చన్
తన మరణంపై తప్పుడు వార్తలు ప్రచురించినందుకుగానూ ముంబై హైకోర్టులో పిటిషన్
బిగ్ బీ మనవరాలు, అందాల ఐశ్వర్యారాయ్, అభిషేక్ ల గారాల పట్టి ఆరాధ్యా బచ్చన్ 11ఏళ్ల పసి ప్రాయంలోనే తన హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించింది. పలు యూట్యూబ్ ఛానళ్లు తనపై రాస్తున్న తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు గానూ పది యూట్యూబ్ ఛానళ్లపై పిటిషన్ వేసింది. తనపై వచ్చిన కథనాలను లిస్ట్ అవుట్ చేసి, వాటిని పూర్తిగా డిలీట్ చేయాల్సిందిగా పిటిషన్ లో ప్రస్తావించింది. తాను మైనర్ గనుక తనపై కథనాలు ప్రసారం చేసేందుకు వారికి హక్కులేదని స్పష్టం చేసింది. గూగుల్ ఎల్ఎల్ సీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కూడా ఈ కేసులో పార్టీలుగా చేర్చింది. ఆరాధ్య పిటిషన్ ను ముంబై హైకోర్టు గురువారం విచారించనుంది.

Tags

Read MoreRead Less
Next Story