అండాలు భధ్రపరచి... అమ్మతనాన్ని ఆశ్వాదిస్తోన్న తారామణులు

అండాలు భధ్రపరచి... అమ్మతనాన్ని ఆశ్వాదిస్తోన్న తారామణులు
మాతృత్వపు మాధుర్యాన్ని ఆశ్వాదిస్తూనే, కలల సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటోన్న తారామణులు

మాతృత్వపు మాధుర్యాన్ని ఆశ్వాదించాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అమ్మా అన్న పిలుపు కోసం పరితపిస్తుంది. కానీ, ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో అమ్మతనాన్ని ఆశ్వాదించాలంటే... అందుకు కెరీర్ పరంగా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా గ్లామర్ రంగంలో పనిచేస్తున్నవారికి మాతృత్వం అంటే కెరీర్ కు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టినట్లే. అయితే వైద్య రంగంలో చోటు చేసుకుంటోన్న తాజా పరిణామాలు, అత్యాధునిక వైద్య విధానాలు, నేటి తరం నాయికలకు అద్భుతమైన వరంగా మారాయి. వయసులో ఉన్నప్పుడే తమ అండాల్ని ఫ్రీజ్ చేసి, తమకు నచ్చినప్పుడే తల్లులు అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మెగా వారి కోడలు, ఉపాసన కొణిదెల తాను ఇదే విధంగా తల్లినయ్యానని స్పష్టం చేసింది. మాతృత్వపు మధురిమలను తాను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడే ఆశ్వాదించాలని నిర్ణయించుకున్న ఉపాసన, కొత్త తరం తల్లులకు ఆదర్శంగా నిలుస్తోంది.

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా సైతం ౩౦ల్లో ఉన్నప్పుడే తన అండాలను ఫ్రీజ్ చేయించిందట. తన తల్లి మధు చోప్రా గైనకాలజిస్ట్ కావడంతో ఆమె సహకారంతో ప్రియాంక ఈ ప్రక్రియకు ఓటేసింది. ఆ సమయంలో తన కెరీర్ పీక్ పొజిషన్ లో ఉండటంతో పాటూ, తన పిల్లలకు తండ్రి అవదగిన వాడు తారసపడకపోవడంతో తన అండాలను ఫ్రీజ్ చేయించింది. అనంతరం నిక్ జోనాస్ తో వివాహనంతరం సారోగసీ ద్వారా మాల్టీకి తల్లైంది. ప్రస్తుతం ప్రియాంక అటు హాలీవుడ్ కెరీర్ తో పాటూ మాల్టీకి తల్లిగానూ బాధ్యతలు నిర్వహిస్తోంది.

బాలీవుడ్ నటి కాజోల్ చెల్లెలు, తానిషా ముఖర్జీ సైతం భవిష్యత్తుల ో తల్లి అవ్వలన్న సంకల్పంతో తన అండాలను నిల్వ చేసింది. ఈ పని ఇంతకు ముందే చేసి ఉండాల్సిందని, అనవసరంగా తన వైద్యురాలి మాట విని లేట్ చేసానంటోంది తానిషా. తల్లి అయ్యేందుకు తన మనసు పూర్తిగా అంగికరించినప్పుడే ఆ సంగతి ఆలోచించుకోవచ్చని ధీమాగా చెబుతోంది.

అయితే అండాలు నిల్వ చేసే ప్రక్రియకు హీరోయిన్లు జై కొట్టడం కొత్తగా ఏమీ జరగడంలేదు. గతంలోనే విశ్వసుందరి డయానా హెడెన్ ఇదే విధంగా యుక్త వయసులో ఉన్నప్పుడే తన అండాలను ఫ్రీజ్ చేయించింది. 2016లో తొలి బిడ్డకు, అనంతరం 2018లో కవలలకు జన్మనిచ్చింది. ఈ చిన్నారులు అందరూ అందంగా, ఆరోగ్యంగా పెరుగుతున్నారు అనడంలో సందేహమేలేదు. అయితే, తాను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ తనను విచిత్రంగా చూశారని, ఎన్నో మాటలు అన్నారని డయానా చెబుతోంది.

జెస్సీ జైసీ కోయీ నహీ అంటూ అప్పట్లో ఆబాల గోపాలాన్నీ అకట్టుకున్న మోనా సింగ్, 39ఏళ్లకు వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే తాను 34ఏళ్లకే తన అండాలను భధ్రపరచింది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఆశ్వాదిస్తున్నాను అంటోన్న మోనా సింగ్, మరి కొద్ది రోజులు ఇలాగే భర్తతో కలసి ప్రపంచాన్ని చుట్టి రావాలనుకుంటోందట. ఆ తరువాతే మాతృత్వాన్ని ఆహ్వానిస్తానంటోంది మన జెస్సీ.

ఇక రాఖీ సావంత్ కూడా నేను సైతం అంటూ ఈ లీగ్ లో ఎప్పుడో చేరిపోయింది. ప్రస్తుతం ఆమె వైవాహిక జీవితంగానీ, ప్రేమైక జీవితంగానీ సజావుగా సాగుతోన్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఏదోక రోజు తల్లిని అవుతానని, తన బిడ్డకు ఓ మంచి విక్కీ డోనార్ దొరుకాతాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది రాఖీ.

Tags

Next Story