స్పోర్ట్స్ కోటా కింద ఐదుగురు అథ్లెట్లకు అడ్మిషన్ ఇచ్చిన ఐఐటి మద్రాస్

స్పోర్ట్స్ కోటా కింద ఐదుగురు అథ్లెట్లకు అడ్మిషన్ ఇచ్చిన ఐఐటి మద్రాస్
X
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 'స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్' (SEA) విభాగంలో జాతీయ విజయాలు సాధించిన ఐదుగురు అథ్లెట్లను చేర్చుకున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

ఫిబ్రవరి 2024లో, IIT మద్రాస్ తన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో SEA కేటగిరీ కింద అథ్లెట్ల కోసం ప్రవేశాలను ప్రవేశపెట్టిన దేశంలోనే మొదటి IITగా అవతరించింది. ఈ చొరవ భారతీయ క్రీడాకారుల కోసం దాని ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో రెండు సూపర్‌న్యూమరీ సీట్ల ద్వారా అందించబడుతుంది. అందులో ఒకటి మహిళా విద్యార్థులకు రిజర్వ్ చేయబడుతుంది.

ఐఐటీ మద్రాస్‌లో ప్రవేశానికి ఎంపికైన ఐదుగురు విద్యార్థులు.. మహారాష్ట్రకు చెందిన ఆరోహి భావే (వాలీబాల్), BS (మెడికల్ సైన్సెస్ మరియు ఇంజినీరింగ్), పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆర్యమాన్ మండల్ (వాటర్ పోలో మరియు స్విమ్మింగ్), BTech (కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్)లో చేరారు. ఢిల్లీకి చెందిన నందిని జైన్ (స్క్వాష్), బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్)లో చేరారు. ఢిల్లీకి చెందిన ప్రభవ్ గుప్తా (టేబుల్ టెన్నిస్), బీటెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్)లో మరియు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వంగల వేదవాచన్ రెడ్డి (లాన్ టెన్నిస్) బీటెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్)లో చేరారు.

“స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ అనేది ఐఐటి మద్రాస్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ప్రధానంగా పిల్లలను ఆడటానికి ప్రోత్సహించాలనే ముఖ్యమైన సందేశం అందరికీ చేరుతుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను” అని మద్రాస్ ఐఐటి డైరెక్టర్ వి కామకోటి అన్నారు. తమకు ఐఐటీ మద్రాస్ వంటి ప్రముఖ యూనివర్శిటీలో అడ్మిషన్ రావడం పట్ల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story