Agniveer Vayu: అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
Indian Air Force: భారతీయ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్రివీర్ వాయు అభ్యర్థుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 27, 2023 నుంచే అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in./AV/ నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కి తుది గడువు ఆగస్ట్ 17, 2023 వరకు నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులకు అక్టోబర్ 13 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకి అప్లికేషన్ ఫీజు 250/- నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్, డెబిట్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
అర్హత..
సైన్స్ సబ్జెక్స్ చదివిన వారికి, సైన్సేతర సబ్జెక్స్ చదివిన విద్యార్థులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. 2003 జూన్ 27 నుంచి డిసెంబర్ 27, 2006 మధ్య జన్మించిన వారు అప్లై చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం..
ఎంపిక విధానం 3 అంచెల్లో జరగనుంది. మొదటి దశలో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. 10+2 CBSE సిలబస్ ఆధారంగా ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్ష 60 నిమిషాల వ్యవధి ఇస్తారు. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా తర్వాతి దశకు ఎంపిక చేస్తారు. రెండవ దశనూ దాటిన అభ్యర్థులు, 3వ దశలో మెడికల్ పరీక్షలకు అర్హత సాధిస్తారు.
అన్ని విభాగాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను మే 27, 2024 రోజున ప్రకటిస్తారు. అభ్యర్థుల రిజిస్టర్డ్ ఈమెయిల్‌కి ఈ-కాల్ లెటర్స్ పంపిస్తారు.
IAF అగ్నివీర్- 2023 పరీక్షా విధానం
వ్రాత పరీక్ష: బహుళ-ఎంపిక ప్రశ్నలు (MCQలు). ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ - 1/4
సబ్జెక్ట్‌లు: జనరల్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్ మరియు సంబంధిత అంశాలు,
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT): రన్నింగ్, పుష్-అప్‌లు, సిట్-అప్‌లు మొదలైన వాటిల్లో సామర్థ్యం పరీక్షిస్తారు.
వైద్య పరీక్ష: సమగ్రమైన ఆరోగ్యస్థితిని అంచనా వేస్తారు.
వ్యక్తిగత ఇంటర్వ్యూ: భారత వైమానిక దళానికి తగ్గట్లుగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇతర అంశాలు అభ్యర్థుల్లో అంచనా వేస్తారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com