కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి దించిన తరువాతే తాను మరణిస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కొనసాగించిన సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖర్గే వ్యాఖ్యలు ప్రధానమంత్రి పట్ల కాంగ్రెస్ నాయకులకు ఉన్న "ద్వేషం" వ్యక్తమవుతోందని షా ఆరోపించారు, కాంగ్రెస్ చీఫ్ అనవసరంగా ప్రధాని మోడీని తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలలోకి లాగారని అన్నారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఖర్గే అస్వస్థతకు గురయ్యారు.
సంఘటన జరిగిన కొద్దిసేపటికే, తాను ఇప్పుడే చనిపోనని, ప్రధాని మోడీని గద్దె దించేవరకు ఆరోగ్యంగా ఉంటానని అన్నారు. దీనిపై షా స్పందిస్తూ.. "ఈ కాంగ్రెస్‌కు ప్రధాని మోడీ పట్ల ఎంత ద్వేషం, భయం ఉందో అర్ధమవుతోందని, వారు నిరంతరం ఆయన గురించే ఆలోచిస్తున్నారనేదానికి ఇది నిదర్వనమని కేంద్ర హోం మంత్రి అన్నారు.
ఖర్గే జీ ఆరోగ్యం కోసం, మోడీ , నేను ప్రార్థిస్తున్నాము. మనమందరం ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిద్దాము. అతను చాలా సంవత్సరాలు జీవించాలని, విక్షిత్ భారత్ సృష్టిని చూడాలని కోరుకుంటున్నాను. 2047 నాటికి అది సాధ్యమవుతుందని షా చెప్పారు. 83 ఏళ్ల ఖార్గే 'సింకోపాల్ అటాక్'కు గురయ్యారు, ఇది స్పృహ కోల్పోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. తన ప్రసంగంలో కొద్దిసేపు విరామం తర్వాత తిరిగి మాట్లాడుతూ, " ప్రధాని మోదీని అధికారం నుంచి తప్పించే వరకు నేను బతికే ఉంటాను అని అన్నారు.
అనంతరం ప్రధాని మోదీ ఆదివారం ఖర్గేతో మాట్లాడి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com