అదిరిపోయేలా అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్

అదిరిపోయేలా అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్

రిలయన్స్ అధినేత ముఖేష్ అం బానీ చిన్న కు మారుడు అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా రు. రిలయన్స్ ఇండస్ట్రీ ఉన్న జామ్ నగర్ లో ఈ వేడులకను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అతిథులకు వడ్డించేం దుకు ఏకంగా 2,500 వంటకాలను సిద్ధం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ప్రముఖ వ్యాపార వేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికను అనంత్ అంబానీ వివాహం చేసుకోనున్నారు.

ప్రీ వెడ్డింగ్ వేడుకలు మా ర్చి 1 నుంచి మూడు రోజుల పాటు జరపనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ లు వెయ్యి మందికిపైగా ఈ వేడుకలకు హాజర కానున్నారు. అతిథులకు మూడు రోజుల పా టు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. మధ్య ప్రదేశ్లోని ఇండోర్కు చెం దిన 21 మంద చెఫ్ ను ఇందు కోసం నియమించారు.

ఆహ్వానితులకు భారతీ య వంటకాలతో పాటు, జపనీస్, మెక్సి కన్, థాయ్, పార్సీ ఇలా అనేక సంప్రదాయ వంటకాలను వడ్డించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో 75 రకాలు, లంచ్లో 225 రకాలు, డిన్న ర్లో 275 రకాల వంటకాలను వడ్డించను న్నారు. మిడ్నైట్ స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నా రు. అర్ధరాత్రి 12 నుంచి 4 గంటల వరకు 85 రకాల వంట్లకా ల్లో ఏదికోరితే దాన్ని మిడ్నైట్ స్నాక్స్ అందించనున్నారు.

Tags

Next Story