Ap News : వైసిపి కి ఓటమి ఖాయం

దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అంతకు మించిన ఉత్కంఠను కలిగిస్తోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లు. ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యావత్ భారతదేశం సైతం 2024 ఏపీ ఎన్నికలపైనే ఫోకస్ ఉంచినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ గెలుపు తమదంటే తమదంటూ సవాలు విసిరాయి. ప్రస్తుతం కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో అధికార వైసిపి వెనుకంజలో ఉంది. దీంతో వైసిపి గెలుపు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం ఏపీలో కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లోను ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల ఎక్కింపులోనూ అధికార వైసిపి వెనుకబడి ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులే వెనుకబడి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్య సమయానికి టిడిపి కంచికోట కుప్పంలో చంద్రబాబు నాయుడుకి 1500 పైచిలుక ఓట్లు వచ్చాయి. ఇక పిఠాపురంలో సైతం పవన్ కళ్యాణ్ ఆదిక్యంలో కొనసాగుతున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ లీడింగ్ లో ఉన్నారు. పాణ్యం లో టిడిపి అభ్యర్థి గౌరు చరిత ఆదిత్యంలో కొనసాగుతున్నారు. ఇక మొత్తం 175 నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. టిడిపి 78 స్థానాల్లో ఆదిత్యంలో కొనసాగుతుంది. అధికార వైసిపి 19 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగగా.. జనసేన పార్టీ 13 స్థానాల్లో ఆదిత్యంలో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక లోక్సభ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ 217 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది. సమాజవాది పార్టీ 29 స్థానాల్లో కొనసాగగా తృణమూల్ కాంగ్రెస్ 16 స్థానాల్లో ముందంజలో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com