Avatar 2: అవతార్ 2 యానిమేటర్‌ మనోడే! కాలేజీ మధ్యలోనే మానేసిన కుర్రాడు...

Avatar 2: అవతార్ 2 యానిమేటర్‌ మనోడే! కాలేజీ మధ్యలోనే మానేసిన కుర్రాడు...
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాజశేఖర్ భూపతి; హైదరాబాద్ లోనే యానిమేషన్ రంగంలో తర్ఫీదు; ఎన్నో ఒడిదుకులను అధికమించి సాగిన ప్రయాణం

పాండోరా అనే అత్భుద ప్రపంచాన్ని సృష్టించి 3గంటల పాటూ రంగులలోకంలో విహరింపజేసిన అవతార్... వెండితెరపై తీర్చిదిద్దిన అద్భుత దృశ్యకావ్యమనే చెప్పాలి. యానిమేషన్ రంగంలోనే అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్ తో రూపొందింపబడ్డ ఈ సినిమా ఇతర చిత్రాలకు కొలమానంగా నిలుస్తోంది. అలాంటి చిత్ర బృందంలో మన తెలుగోడు కూడా భాగస్వామి అవ్వడం మనకూ గర్వకారణమనే చెప్పాలి. ఆదిలాబాద్ కు చెందిన రాజశేఖర్ భూపతి అవతార్ కు పనిచేసిన వెటా ఎఫ్ఎక్స్ బృందంలో కీలక సభ్యుడు కావడం విశేషం.

చిన్నతనంలో కార్టూన్‌ల నుంచి మొదలైన ఆసక్తి పెరిగి పెద్దదయ్యి యానిమేషన్ రంగంవైపు అతడి అడుగులు పడేలా చేసింది. టీవీలో కార్టూన్లు ఎలా కదులుతున్నాయో తెలుసుకోవాలనే కుతూహలమే నేడు అవతార్ వంటి దృశ్యకావ్యాన్ని తీర్చిదిద్దేలా చేసింది.

అయితే వెటా ఎఫ్ఎక్స్ కు చేరుకునేందుకు రాజశేఖర్ కాలంతో గట్టిగానే పోటీపడ్డారని చెప్పాలి. యానిమేషన్‌ నేర్చుకోవాలంటే చాలా కర్చుతో కూడుకున్న పని కావడంతో తల్లి తండ్రులు అతన్ని సాధారణ డిగ్రీ కోర్సులో చేర్చారు. అయినా రాజశేఖర్ తన కోరికను నెరవేర్చుకోవాడానికి చదువును మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ వచ్చేశారు.

అక్కడ ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ నుంచి యానిమేషన్‌లో లైటింగ్, కంపోజిటింగ్ మెళుకువలను నేర్చుకున్నారు. పార్ట్‌ టైం జాబ్ చేస్తూ యానిమేషన్‌ నేర్చుకున్నారు. డబ్బులు ఆదా చేసేందుకు కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూనే వెళ్లేవారు. ఈ క్రమంలో మేనమాన సాయి దిశానిర్దేశంతో ఈ రంగంలో తగినంత నైపుణ్యాన్ని సంపాదించి డిస్క్రీట్ ఆర్ట్స్ అనే సంస్థలో ఉద్యోగం సంపాదించారు. నెలకు రూ. 7,000 వేతనంతో ఉద్యోగం చేస్తూనే మరోవైపు డిగ్రీ కూడా పూర్తి చేశారు.

క్రమంగా సినిమాలకు పనిచేసే సంస్థల్లో ఉద్యోగం దొరకబుచ్చుకున్న రాజశేఖర్ ఎన్నో యానిమేషన్/కార్టూన్ చిత్రాలకు పనిచేశారు. MPCసంస్థలో ఉన్నప్పుడు ఆక్వామాన్, క్యాట్స్ వంటి ప్రముఖ ప్రాజెక్ట్‌ల్లో పనిచేశారు. తర్వాత వెటా ఎఫ్‌ఎక్స్‌లో పని చేసే అవకాశాన్ని పొందారు. ఇందు కోసం 2022లో ఆస్ట్రేలియాకు వెళ్లారు. జేమ్స్ కామెరూన్ అవతార్ 2కు సేవలు అందించిన సంస్థల్లో వెటా ఎఫ్ఎస్ ఒకటి. ఇది తన కలలను సాకారం చేసిన ప్రాజెక్ట్ అని కొనియాడిన రాజశేఖర్.. తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇది ఒకటని భావిస్తున్నట్లు తెలిపారు. ఏమైనా ప్రపంచం గర్వించదగ్గ ప్రాజెక్ట్ లో భాగమైన రాజశేఖర్ మరిన్ని విజయశిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.

Tags

Read MoreRead Less
Next Story