
బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి రోజునే పాప పుట్టడం చాలా ఆనందంగా ఉందని జ్వాల-విశాల్ సోషల్ మీడియాలో అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమిళ నటుడు విష్ణు విశాల్‌తో జ్వాలకు 2021 ఏప్రిల్ 22న వివాహం జరిగింది. మొదటి భార్య రజినీ నాయర్‌తో ఆయనకు ఇప్పటికే ఓ కొడుకు (ఆర్యన్) ఉన్నాడు. కాగా విశాల్-రజినీ 2010లో పెళ్లి చేసుకుని 2018లో విడిపోయారు.
క్రికెట్‌లో కొంతకాలం కెరీర్ తర్వాత 2009లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విష్ణు విశాల్. ‘ఎఫ్‌ఐఆర్’ సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యారు. గతేడాది విడుదలైన ‘లాల్ సలాం’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరించారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా నితిన్ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com