
By - Manikanta |6 Feb 2025 3:00 PM IST
ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. చలి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం, రాత్రి మినహాయిస్తే పగటి పుట ఉష్ణోగ్రతలు మాడు పగలకొడుతున్నాయి. గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఏపీలో ఒకపక్క ఎండలు మరోపక్క ఉక్కపోతతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. నందిగామలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యింది. విశాఖపట్నం, కళింగపట్నం, శ్రీకాకుళం వంటి చోట్ల సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. తెలంగాణలో కూడా గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో అప్పుడే 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలో నెలలో వడగాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com