ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రోయ్ కన్నుమూత.. ప్రధాని సంతాపం

ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రోయ్ కన్నుమూత.. ప్రధాని సంతాపం
X
డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ జీ ఒక ఉన్నతమైన వ్యక్తి, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి విభిన్న రంగాలలో ప్రావీణ్యం కలిగినవారు అని X లో పేర్కొంటూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.

అగ్రశ్రేణి ఆర్థికవేత్త మరియు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ 69 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయనను ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. "డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ జీ ఒక ఉన్నతమైన పండితుడు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత మరియు మరిన్ని వంటి విభిన్న రంగాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. తన రచనల ద్వారా, అతను భారతదేశ మేధో రంగం మీద చెరగని ముద్ర వేశారు. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషి, యువతకు అందుబాటులో ఉండేలా మన ప్రాచీన గ్రంథాలపై పని చేయడం ఆయన కృసికి నిదర్శనం అని మోదీ X లో పేర్కొన్నారు.


Tags

Next Story