ఢిల్లీలోని 23 పాఠశాలలకు బాంబు బెదిరింపు.. ఇమెయిల్ పంపిన 12వ తరగతి విద్యార్థి
నగరంలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపిన ఆరోపణలపై 12వ తరగతి విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నాయి. దాదాపు 10 పాఠశాలలకు గురువారం బాంబు బెదిరింపులు రావడంతో రాజధానిలో కలకలం చెలరేగింది.
ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు గతంలో 23 బెదిరింపు ఇమెయిల్‌లు పంపిన ఈ నిందితుడే కారణమని దక్షిణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అంకిత్ చౌహాన్ తెలిపారు. "విచారణ సమయంలో, అతను ఇంతకుముందు కూడా బెదిరింపు ఇమెయిల్‌లు పంపినట్లు అంగీకరించాడు" అని చౌహాన్ చెప్పారు.
నిందితుడు మైనర్ అని దక్షిణ జిల్లా పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో బాంబుల బూటకపు వార్తల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఇంత దారుణంగా ఎన్నడూ చూడలేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో స్పందించిన పోలీసులు ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖతో సదస్సు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com