పుష్ప 2 మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం
X
By - Chitralekha |31 May 2023 12:08 PM IST
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద బస్సును ఢీకొన్న మరో బస్సు
పుష్ప 2 మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సును.. వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులతో పాటు.. ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులు కూడా గాయపడ్డారు. షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com