Chahal-Dhanashree : విడాకులపై చాహల్-ధనశ్రీ యూటర్న్?

Chahal-Dhanashree : విడాకులపై చాహల్-ధనశ్రీ యూటర్న్?

క్రికెటర్ చాహల్, ఆయన భార్య ధనశ్రీ విడిపోతున్నట్లు గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో చాహల్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా నుంచి హైడ్ చేసిన ధనశ్రీ తాజాగా వాటిని రిస్టోర్ చేశారు. దీంతో వీరు విడిపోవట్లేదా? లేదా తాను ఇంకా అతని భార్యనేనని ఆమె గుర్తు చేస్తున్నారా? అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చాహల్ ఇటీవల RJ మహ్వాష్‌తో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి.

“మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషన్‌లో ఉంటుంది!” అంటూ సోమవారం, ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక రహస్యమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ పోస్టు హల్‌చల్ రేపడంతో, నెటిజన్లు దీన్ని యుజ్వేంద్ర చాహల్‌ తో అనుసంధానించారు. అయితే, కొంతమంది మాత్రం ఇది ఆమె సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌కు స్పందన అని అభిప్రాయపడ్డారు.

చాహల్, ధనశ్రీ వర్మ 2020లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల బంధం తర్వాత గతేడాదే వీళ్లు విడాకులకు అప్లై చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఇద్దరూ విడిపోయి ఉంటున్నారని తెలిసింది. ఈ విషయంపై ఇద్దరూ మౌనం వహిస్తూనే వచ్చారు.

Next Story