ChatGPT : చాట్ జీపీటీ వాట్సప్ లో మరో కొత్త ఫీచర్

ChatGPT : చాట్ జీపీటీ వాట్సప్ లో మరో కొత్త ఫీచర్

ఓపెన్ ఏఐకి చెందిన చాట్ బాట్ 'చాట్ జీపీటీ'లో మరో కొత్త సదుపాయం తీసుకు వచ్చింది. వాట్సప్ ద్వారా చాటి జీపీటీ సేవలను అందించేందుకు ఇంతకు ముందే ప్రత్యేకంగా ఓ నంబర్ ను సంస్థ తీసుకు వచ్చింది. తాజా తన సేవలను మరింత విస్తృతం చేసింది. ఇప్పటి వరకు కేవలం టెక్స్ట్ మెసేజ్ లకు మాత్రమే సమాధానాలు ఇస్తూ వస్తున్న చాట్ జీపీటీ ఇక నుంచి ఆడియో, ఫోటో ఇన్ పుట్ కు కూడా స్పందించనుంది. కొత్త సదుపాయం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఏదైనా ఇమేజ్ ను వాట్సప్ ద్వారా అప్లోడ్ చేసి దానికి సంబంధించిన ప్రశ్న అడిగితే చాటిజీపీటీ సమాధానం ఇస్తుంది. ఇమేజ్ అప్లోడ్ చేస్తే దాన్ని ఓపెన్ ఏఐ సర్వర్లకు పంపించి ప్రాసెసింగ్ చేసి దానిపై సమాధానం ఇస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేయకుండా ఉండడమే మేలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇదే తరహాలో వాయిస్ ఇన్ పుట్ ను కూడా విశ్లేషించి ప్రశ్నలకు చాటిజీపీటీ సమాధానాలు ఇస్తుంది. చాటీపీటీ సేవలను పొందడానికి +1800 2428 478 నంబర్ ను 'పోపెన్ ఏఐ' గత సంవత్సరం డిసెంబర్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ నంబర్ కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకుంటే మీరు అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ బదులిస్తుంది. చాటీపీటీ వెబ్సైట్, యాప్ డౌన్లోడ్ చేసుకోకుండానే ఇక వాట్సప్ లో దీన్ని వాడే ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఐతే.. రోజువారీ వాడకంపై మాత్రం లిమిట్ పెట్టారు.

Next Story