Chennai: వైద్యుడిపై కత్తితో దాడి చేసిన యువకుడి అరెస్ట్

చెన్నై ఆసుపత్రిలో వైద్యుడిని పలుమార్లు పొడిచి చంపిన యువకుడు కత్తిని విసిరివేసి ప్రశాంతంగా నడుచుకుంటూ బయటకు వెళుతున్నాడు. అంతలో అక్కడున్న పేషెంట్ల తాలూకూ బంధువులు అతడిని పట్టుక్కోండి అని అరవడంతో భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు.
నిందితుడి తల్లికి వైద్యం చేసిన డాక్టర్ బాలాజీకి పేస్ మేకర్ ఉంది. నిందితుడు అతని నుదురు, వీపు, అతని చెవి వెనుక మరియు పొట్టపై కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు.
రాష్ట్ర ఆధ్వర్యంలో నడిచే కలైంజర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆంకాలజిస్ట్ డాక్టర్ బాలాజీ జగన్నాథ్‌ను కత్తితో పొడిచి నిందితుడు విఘ్నేష్. దాడి చేసిన వ్యక్తి తల్లి క్యాన్సర్ రోగికి డాక్టర్ బాలాజీ చికిత్స అందిస్తున్నారు. తన తల్లికి వైద్యుడు తప్పుడు మందులు రాసి ఉంటాడని దాడి చేసిన వ్యక్తి అనుమానం వ్యక్తం చేశాడు.
వైద్యుడిపై దాడి జరిగిన గంట తరువాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాడి చేసిన వ్యక్తి తన జేబులో నుండి దాడికి ఉపయోగించిన కత్తిని బయటకు తీసి నడుచుకుంటూ వెళుతున్నాడు. కత్తికి అంటిన రక్తాన్ని తుడిచి ఆ కత్తిని షాఫ్ట్ ప్రాంతంలోకి విసిరి వేశాడు.
వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి "కనీసం ఇప్పుడైనా అతన్ని పట్టుకోండి" అని అరుస్తున్నాడు. "మీ అమ్మ లేదా నాన్న ఇబ్బందుల్లో ఉంటే" ఆ బాధ ఏంటో అప్పుడు నీకు అర్థం అవుతుంది అని నిందితుడు చెప్పాడు. ఈ గందరగోళం మద్య ఆస్పత్రి సిబ్బంది అతడిని పట్టుకుని కొట్టడం ప్రారంభించారు. దాంతో ఒక మహిళ జోక్యం చేసుకుని వారిని అడ్డుకుంది. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రి ఘటనపై విచారణకు ఆదేశించి మరోసారి ఇలాంటి దాడి జరగదని హామీ ఇచ్చారు. "వైద్యుల సేవలు ప్రశంసనీయం.. వారి భద్రతకు భరోసా ఇవ్వడం మా బాధ్యత.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం-హత్య తర్వాత జరిగిన ఈ సంఘటన వైద్యుల భద్రతపై మళ్లీ చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు భద్రత కల్పించేందుకు జాతీయ టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com