రెండు సార్లు విడిపోయి మూడోసారి కలుసుకుని.. భార్య కోసం 4,400 కి.మీ సైకిల్ తొక్కిన చైనీస్ వ్యక్తి..

చైనాలోని ఓ వ్యక్తి రెండేళ్ల నుంచి విడిగా ఉన్న తన భార్యతో రాజీపడేందుకు చాలా ప్రమాదకరమైన సవాలును స్వీకరించాడు. ఆ వ్యక్తి 100 రోజుల్లో దాదాపు 4,400 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై అధిగమించాడు.
జౌ కథ
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని లియాన్యుంగాంగ్‌కు చెందిన 40 ఏళ్ల జౌ షాంఘైలో ఉన్న తన భార్య లీని కలుసుకున్నాడు. వీరికి 2007 లో వివాహం జరిగింది. కానీ ఇద్దరి మద్యా సయోధ్య కుదరని కారణంగా ఈ జంట 2013 లో విడాకులు తీసుకున్నారు. అయినా రాజీపడి మళ్లీ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే కొద్దిరోజుల తర్వాత వారిద్దరి మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక కలసి ఉండడం కష్టం అనుకున్నారు, మళ్లీ విడిపోయారు.
పెద్ద గొడవలు ఏం లేవు.. చిన్న సమస్యను కూడా తెగేదాకా లాగారు. ఎవరూ తగ్గాలనుకోలేదు.. దాంతో విడిపోయారు. కానీ ఇద్దరూ మదనపడ్డారు. మళ్లీ తప్పు చేశామేమో అని. అదే చెప్పాడు జౌ మీడియాకు..
"మా మధ్య తీవ్రమైన సమస్య లేదు; మేము ఇద్దరం చాలా మొండిగా ప్రవర్తించాము. మళ్ళీ సయోధ్య గురించి చాలాసార్లు లీతో మాట్లాడాను, కానీ లీ వినలేదు.
భార్య అతనికి సవాలు విసిరింది
కానీ ఈసారి అతని భార్య లీ మాట్లాడుతూ, అతను నాతో కలిసి జీవించాలనుకుంటే, లాసాకు సైకిల్ పై వెళ్లాలని చెప్పింది. కానీ అతను నిజంగానే తన సవాలు స్వీకరిస్తాడని ఆమె అనుకోలేదు.
జౌ మొండిగా ఉన్నాడు. జూలై 28న ఆగ్నేయ నగరం నాన్జింగ్ నుండి సైకిల్‌పై తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 100 రోజుల్లో, దాదాపు 4,400 కి.మీ. ప్రయాణించి అక్టోబర్ 28న లాసా చేరుకున్నాడు.
సైకిల్ యాత్రలో భర్త దాదాపు ప్రాణాలు కోల్పోయాడు
ఈ పర్యటనలో జౌ రెండుసార్లు మృత్యువు అంచుల వరకు వెళ్లాడు. మొదటిసారిగా తూర్పు చైనాలోని అన్‌హుయ్ ప్రావిన్స్‌లో హీట్‌స్ట్రోక్‌కు గురై ఆసుపత్రి పాలయ్యాడు. 40-డిగ్రీల వేడిలో సైకిల్ తొక్కుతూ రోడ్డుపై కుప్పకూలిపోయాడు. రెండవసారి యిచాంగ్‌లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో తాగేందుకు తన దగ్గర చుక్క నీరు కూడా లేదు. విషయం తెలుసుకున్న భార్య లీ తనను చూసుకోవడానికి వందల కిలోమీటర్లు ప్రయాణించి జౌ దగ్గరకు వచ్చింది.
భర్త తీవ్రత చూసి భార్య హృదయం ద్రవించింది
భర్త పరిస్థితిని చూసి మొండిగా ఉండటం మానేయమని కోరింది. అయినప్పటికీ, జౌ వినలేదు. తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి, తన నిబద్ధతను నిరూపించుకోవడానికి సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు.
ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు
తిరిగి వస్తుండగా, లాసాకు 400 కి.మీ.ల దూరంలో ఉన్న న్యింగ్చిలో లీ అస్వస్థతకు గురైంది. ఈ విషయం భర్త జౌకు తెలియగానే సైకిల్ యాత్ర ముగించుకుని ఆమెను చూసుకునేందుకు వచ్చాడు. భార్య లీ కోలుకున్న తర్వాత, వారు కలిసి లాసాకు ప్రయాణమయ్యారు. అక్టోబరు 28న చిన్న సయోధ్య వేడుకను నిర్వహించి, తమ పునఃకలయికను అధికారికంగా ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com