Colombia: వారు అమ్మాయిలు.. లైంగిక వస్తువులు కాదు.. 137 ఏళ్ల సివిల్ కోడ్‌కు చెక్

Colombia: వారు అమ్మాయిలు.. లైంగిక వస్తువులు కాదు.. 137 ఏళ్ల సివిల్ కోడ్‌కు చెక్
X
బాల్య వివాహాలను నిషేధించాలని కొలంబియా కాంగ్రెస్ ఓటు వేసింది.

కొలంబియా కాంగ్రెస్ మైనర్లను వివాహం చేసుకోవడానికి అనుమతించే చట్టాన్ని మార్చడానికి ఓటు వేసింది. ఈ ప్రతిపాదన వివాహానికి కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలని నొక్కి చెప్పింది. అయితే ఈ ప్రతిపాదనను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో అంగీకరించి, చట్ట బద్దంగా సంతకం చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం, దేశ సివిల్ కోడ్ 14 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిని తల్లిదండ్రుల సమ్మతితో వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది. చట్టాన్ని సంస్కరించే ప్రతిపాదన - 2023లో సమర్పించబడింది - "వారు ఆడపిల్లలు, భార్యలు కాదు" అనే నినాదాన్ని ఉపయోగించారు. యువతులను బలవంతంగా వివాహం చేసుకోవడాన్ని నిరోధించడం, విద్యను కోల్పోకుండా నిరోధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

"మైనర్లు లైంగిక వస్తువులు కాదు, వారు అమ్మాయిలు" అని కాంగ్రెస్ మహిళ క్లారా లోపెజ్ ఒబ్రెగాన్ ప్రతిపాదనను తీసుకు వచ్చారు. UNICEF ప్రకారం, బాల్య వివాహాలు ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 12 మిలియన్ల మంది బాలికలను ప్రభావితం చేస్తుంది.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని ఏజెన్సీ గణాంకాలు చెబుతున్నాయి. “పదేళ్ల క్రితం, 20 నుండి 24 సంవత్సరాల వయస్సు గల ప్రతి నలుగురిలో ఒక యువతి బాల్య వివాహం చేసుకున్నారు. నేడు ఆ సంఖ్య ఐదుగురిలో ఒకరికి పడిపోయింది” అని యునిసెఫ్‌ తెలిపింది.

లాటిన్ అమెరికాలో, యునిసెఫ్ ప్రకారం, మైనర్‌లు పెళ్లి చేసుకోవడానికి దారితీసే ప్రధాన అంశం పేదరికం.

Tags

Next Story