Crime : కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

Crime : కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పరిధిలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసారు పోలీసులు. 500కేజీల అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నారు. కాటేదాన్ పారిశ్రామిక వాడలోని కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పక్కా సమాచారంతో పట్టుకున్నారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు, లిటిల్ చాప్స్ పేరుతో మ్యాంగో డ్రింక్స్ ను సీజ్ చేసారు పోలీసులు. కుళ్లి పోయిన అల్లం, వెల్లుల్లి తో పేస్టు తయారు చేసి, గాటుగా ఉండేందుకు అసిటిక్ యాసిడ్ తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు.

Tags

Next Story