CS Somesh: ఏపీ క్యాడర్ కు సోమేశ్... తెరవెనుక జరిగిందేమిటి..!?

CS Somesh: ఏపీ క్యాడర్ కు సోమేశ్...  తెరవెనుక జరిగిందేమిటి..!?
ముఖ్యమంత్రి కేసీఆర్ కి నమ్మినబంటు సోమేష్; సోమేష్ పై మంత్రుల గుస్సా; జీహెచ్ఎంసీ కమిషనర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలక నిర్ణయాలు; ధరణి వెబ్ సైట్ రూపకల్పనలో కీలకపాత్ర; ధరణి పై ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణలు

బీఆర్ఎస్ పార్టీలోనూ సోమేశ్ కుమార్ పోకడల పై అసంతృప్తితో రగులుతున్న నేతలు

హైకోర్టు తీర్పుతో ఏపీకి వెళ్లాల్సిన పరిస్ధితి

తక్షణం రాజీనామాచేయాల్సినదేనంటున్న నిపుణులు

సుప్రీంకోర్టుకు వెళ్లిన నిరాశతప్పందంటున్న సీనియర్ఐఏఎస్ లు

తదుపరి ఛీఫ్ సెక్రటరీ రేసులో రామకృష్ణారావు, అరవింద్ కుమార్

ఆర్దిక శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీగా పనిచేస్తున్న రామకృష్ణరావు

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న అర్వింద్ కుమార్

సోమేష్ కుమార్ తక్షణమే ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందేని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కొత్త సీఎస్ ఎవరనేది ఉత్కంఠనెలకొంది. సీనియర్లను కాదని జూనియర్ అయినప్పటికి సోమేష్ కుమార్ కి సీఎస్ గా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ . నాలుగేళ్లపాటు సర్వీస్ లో కొనసాగేందుకువీలుగా సీఎస్ గా సోమేష్ ను ఎంపిక చేశారు. క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేష్ కుమార్ కి హైకోర్టు లో చుక్కెదురుకావడంతో తక్షణం రాజీనామా చేయాల్సినపరిస్ధితి ఏర్పడింది.



ముందు నుంచి తెలంగాణలో కొందరి ఐఎఎస్ లదే హావా అనే విమర్శలు ఎదుర్కొంటున్నవారిలో ముందువరుసలో సోమేష్ ఉన్నారు. అనంతరం రజత్ కుమార్ ,అర్వింద్ కుమార్ ,జయేష్ రంజన్ ల పేర్లు వినిపిస్తాయి.. ముఖ్యమంత్రి కి అత్యంత నమ్మకస్తుడిగా ఉండటం జీహెచ్ ఎంసీ కమిషనర్ గా , రెవెస్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా జీఎస్టీ అమలు, అటు దరణి వెబ్ సైట్ రూపకల్పనలో కీలకంగా వ్యహరించడంతో సీఎం కేసీఆర్ సోమేశ్ వైపు మొగ్గు చూపారు.


డిసెంబర్ 31 2019 న బాద్యతలు స్వీకరించినప్పటినుంచి సీఎస్ గా సోమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. మూడేళ్లపాటు కొనసాగినసోమేష్ కుమార్ ముఖ్యమంత్రి అండదండలు ఉండటంతో మంత్రులు ఒకింత అసహనంతో ఉన్నారు. తమ శాఖలకు సంబందించిన అనేక అంశాలపై సోమేష్ కుమార్ పెండింగ్ పెట్టడంతో గుర్రుగా ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం ఇదే విషయాన్నిస్పష్టంచేస్తున్నారు.


ముఖ్యంగా ధరణి విషయంలో సోమేశ్ కుమార్ వ్యవహారం పై మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేలు కంటే కీడు ఎక్కవగా జరుగుతుందని మంత్రులు వాపోతున్నారు. ఇక ఇప్పుడు హైకోర్టు తీర్పు రావడంతో సీనియర్ ఆల్ ఇండియా అధికారులు సైతం హ్యాపీ ఫీలవుతున్నారు. రాష్ట్రంలో బీహారీ అధికారులదే హావా కొనసాగుతోందనే విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి.


సోమేష్ కుమార్ ఏపీ కివెళ్తారా..సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదంటున్నారు. అయితే ఏపీ కి వెళ్లడం లేదంటే రాజీనామా చేసి ప్రగతిభవన్ లో అడ్వైజర్ గా పనిచేస్తారేమోనంటున్నారు అధికారులు. ఇంకా సేవలు అవసరం అనుకుంటే.. బీఆర్ఎస్ లో కీలకపాత్రపోషించిన ఆశ్చర్యమేమి లేదని ఉన్నతాధికారుల్లో చర్చ సాగుతోంది.

కొత్త సీఎస్ గా ఆర్దిక శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ గా పనిచేస్తున్న రామకృష్ణరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఏనిమిదిన్నరేళ్లుగా ఫైనాన్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరో ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ సైతం రేసులో ఉన్నారు. రామకృష్ణరావు రెండు న్నరేళ్ల సర్వీస్ ఉంటుంది. అర్వింద్ కుమార్ ఇంకా మూడున్నరేళ్లపాటు సర్వీస్ లో కొనసాగనున్నారు, ప్రస్తుతం మంత్రి కేటీఆర్ కు విశ్వాసపాత్రుడిగా పనిచేస్తున్నారు.



సునీల్ శర్మ సైతం రామకృష్ణరావు , అర్వింద్ కుమార్ ల కన్నా ఏడాది సీనియర్ అయినప్పటికి .2024 మేలో రిటైర్ కాబోతున్నారు. శాంతకుమారి 89 బ్యాచ్ అధికారి ఈమే ఏప్రిల్ 2025 వరకు కొనసాగుతారు. తెలంగాణ తొలి సీఎస్ మహిళా అదికారి కావాలనుకుంటే..శాంతకుమారికి చాన్స్ ఉంది.. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో ఆర్దికశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రామకృష్ణరావు వైపు సీఎం కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం ఉంది.. సోమేష్ కు ఊరట లభించే అవకాశాలు లేకపోవడంతో కొత్త సీఎస్ రామకృష్ణరావు దాదాపు ఖరారైనట్టేనని సమాచారం.. సుప్రీం లో ఊరట పైనే సోమేష్ భవితవ్యం ఆధారపడి ఉంది....



సోమేష్ కుమార్ తీర్పుతో మరో ఏడుగురు ఐఏఎస్ అధికారులభవితవ్యం ప్రశ్నార్దకం గా మారింది..ఏపీ కికేటాయించినప్పటికి క్యాట్ ఉత్తర్వుతో తెలంగాణలో కొనసాగుతున్నారు.అటు ప్రస్తుత డీజీపీ అంజన్ కుమార్ సైతం ఏపీ క్యాడర్ చెందిన వారే.. అయినా భవిష్యత్తు పై ఆల్ ఇండియా అధికారుల్లో చర్చ సాగుతోంది...

మార్గం శ్రీనివాస్

Next Story