మన తెలంగాణలో చియా సాగు.. కొత్త పంటను ఇష్టంగా సాగు చేస్తున్న రైతులు..

మన తెలంగాణలో చియా సాగు.. కొత్త పంటను ఇష్టంగా సాగు చేస్తున్న రైతులు..
X
సంగారెడ్డి జిల్లా కర్నాటక సరిహద్దులో చియా విత్తనాలను రైతులు పండిస్తున్నారు.

కర్నాటక సరిహద్దులో నివసించే రైతులకు ప్రస్తుతం కొత్త ఇష్టమైన పంట వచ్చింది. వారు చియా విత్తనాలను సాగు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఇప్పటి వరకు వేసవిలో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసేవారు. ఇప్పుడు వాటి స్థానంలో చియా వచ్చి చేరింది.

మెక్సికో మూలాన్ని కలిగి ఉన్న చియాను విత్తడంలో సరిహద్దులో ఉన్న వారి సహచరుల నుండి వారు ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. చియా విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్నందున ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు కోతులు, అడవి పందుల బెడద ఉండదు ఈ పంటకు. అవి తినవు. దాంతో ఈ పంటను సాగు చేశామని రైతులు తెలిపారు. 90 రోజుల పంటను డ్రై ఇరిగేషన్ (ID) పద్ధతిలో పెంచుతారు. వారానికి ఒకసారి పంటకు నీరందిస్తే సరిపోతుంది.

మొగుడంపల్లిలోని ధనశ్రీ, గోపన్‌పల్లి తదితర గ్రామాల రైతులు వరుసగా మూడో ఏడాది సాగు చేస్తుండగా, కర్ణాటకలోని నాగూర్‌-కే, భీమ్రా తదితర గ్రామాల్లో రైతులు 2023 యాసంగి నుంచి పంటను సాగు చేశారు. సంగారెడ్డిలో మూడేళ్లలో చియా సాగు విస్తీర్ణం 50 ఎకరాలకు పెరిగింది.

కర్ణాటకలో రైతులు చియా సాగు పంటలో లాభాన్ని చూసి ఇక్కడి రైతులు కూడా ఇదే పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నట్లు రైతులు తెలిపారు. ఇక్కడి రైతులకు ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల పంట పండుతోంది. రైతులు తమ ఉత్పత్తులను బీదర్‌లోని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో కొత్త పంట కావడంతో విత్తనాలు కొనుగోలు చేసే యంత్రాంగం లేదని అధికారులు చెబుతున్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంటే చాలా మంది ఈ పంట పండిచడానికి మొగ్గు చూపుతారు.

చియా సాగు రైతులు మాట్లాడుతూ.. పంటకు ఎటువంటి తెగుళ్లు పట్టవు. కాబట్టి తక్కువ నిర్వహణ అవసరం. దళారుల ప్రమేయం లేకుండా విత్తన కొనుగోలు, ఉత్పత్తులను విక్రయించి లాభాలు వచ్చేలా ప్రభుత్వం రైతులకు మార్గదర్శకత్వం వహించాలని అధికారులను కోరుతున్నారు.

Tags

Next Story