Delhi: ప్రియురాలి గాయం చూసి ఆగిన ప్రియుడి గుండె

ఢిల్లీలోని జగత్‌పురి పరిసర ప్రాంతంలో నివసిస్తున్న తన స్నేహితురాలు స్వీయ-హాని వీడియోను చూసి ప్రియుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు.
ఇద్దరి మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు.. దాంతో మనస్థాపానికి గురైన ఆమెకు చేయి మణికట్టు దగ్గర కోసుకుని ఆ వీడియోను ప్రియుడికి పంపింది. అది చూసి హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించాడు. హాస్పిటల్ బెడ్ పై ఆమె పరిస్థితిని చూసి అతడి గుండె తట్టుకోలేకపోయింది. స్పృహ తప్పి కింద పడిపోయాడు.. వెంటనే ప్రాణాలు కోల్పోయాడు.
సంవత్సరం క్రితం ఆన్‌లైన్‌లో కలుసుకున్న ఈ జంట, తరచుగా ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకునేవి. న్యాయ విద్యను అభ్యసించిన ఆమె ప్రియుడికి సరైన ఉద్యోగం లేదని తరచు హెచ్చరించేది.
శుక్రవారం అతడి బంధువులలో ఒకరితో ఘర్షణకు దిగింది. అదే రోజు రాత్రి, ఆమె తన మణికట్టును కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వీడియోలో రికార్డ్ చేసి తన భాగస్వామితో పంచుకుంది.
ఆందోళన కలిగించే వీడియో చూసిన వెంటనే అతడు ప్రియురాలి తల్లిని సంప్రదించి సహాయం కోరాడు. అతడే వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి నర్సుకు పరిస్థితిని వివరించాడు. తక్షణం వైద్య సహాయం కోరాడు. అయితే, తన స్నేహితురాలి గాయాలను చూసి తల్లడిల్లిపోయాడు. కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
అయితే చికిత్స అనంతరం ప్రియురాలు ప్రాణాలతో బయటపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com