ECommerce: 2019 లో ఆర్డర్‌, 2023 లో డెలివరీ..

ECommerce: 2019 లో ఆర్డర్‌, 2023 లో డెలివరీ..

ఈరోజుల్లో ఆన్‌లైన్‌లో ఈ ఆర్డర్‌ చేశామంటే, ఈ రోజే రావాలి లేదా కనీసం రేపటి వరకైనా డెలీవరీ రావాలని అంతా కోరుకుంటారు. ఈ రోజు చేసిన ఆర్డర్ 4 సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే ఎవరైనా చేస్తారా..?. ఇక ఎప్పటికీ రాదు అనుకున్నవి, అకస్మాత్తుగా ప్రత్యక్షమైతే సంభ్రమాశ్చర్యాలకు గురికావడమే తరువాయి. ఇటువంటి కొత్త, ఫన్నీ అనుభవం ఢిల్లీకి చెందిన టెకీ నితిన్ అగర్వాల్‌కు ఎదురైంది. అపుడు ఎప్పుడో కొవిడ్‌కి ముందు 2019లో పెట్టిన ఆర్డర్, ఈ మధ్యే అతనికి చేరింది.

ఈ ఫన్నీ అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఎప్పటికీ, దేనీమీద ఆశలు కోల్పోవద్దని హితవు పలుకుతున్నాడు.

"జీవితంలో ఎప్పటికీ దేనిపైనా ఆశలు కోల్పోవద్దు. నేను 2019 లో అలీ ఎక్స్‌ప్రెస్‌ లో ఒక వస్తువు కోసం ఆర్డర్ చేశాను. అది 2023 లో ఈరోజు నాకు వచ్చింది." అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. అయితే ఆర్డర్‌కి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

ఇది షేర్‌ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్ట్‌పై చాలా మంది సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా స్పందించారు.

"నేను కూడా 2019 సంవత్సరంలో ఒకటి ఆర్డర్‌ పెట్టారు. అంటే ఏదో ఒకరోజు అది నాకు వస్తుంది అన్నమాట." అంటూ ఒక యూజర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

అయితే ఈ అలీ ఎక్స్‌ప్రెస్‌ చైనా చెందిన అలీబాబా ఈ కామర్స్‌కి సంబంధించినది. చైనా నుంచి చౌక ధరల వస్తువులను దీని ద్వారా కొనుగోలుకు వినియోగించేవారు. అయితే పలు భద్రతా కారణాలతో 2020 లో 58 చైనా యాప్‌లను నిషేధించింది. ఇందులో అలీబాబా కూడా ఒకటి.

ఇప్పటికీ కొంత మంది వినియోగదారులు VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌) వంటి నెట్‌వర్క్‌ టెక్నాలజీ సాయంతో ఉపయోగిస్తున్నారు. కానీ ఇలా చేయడాన్ని కూడా భారత ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story