దీపావళి విషాదం.. గ్లాసు పటాకుల ముక్కలు గొంతులో గుచ్చుకుని 8 ఏళ్ల చిన్నారి..

దీపావళి విషాదం.. గ్లాసు పటాకుల ముక్కలు గొంతులో గుచ్చుకుని 8 ఏళ్ల చిన్నారి..
X
అన్ని పండుగలలోకి దీపావళి పండుగ వస్తుందంటే చిన్నారులకు ఎంతో సరదా.. కానీ అజాగ్రత్తగా ఉంటే ఆ పండుగే వారి ఇంట విషాదాన్ని నింపుతుంది.

దీపావళి పండుగ వారి ఇంట విషాదం నింపింది. ఒక దురదృష్టకర సంఘటనలో, దీపావళి రోజున వెలిగించిన బాణసంచా గ్లాసులోంచి పేలడంతో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తమ చిన్నారి మృతి పట్ల బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

టిట్రోలోని మొహల్లా మహాజన్‌లో, అశోక్ కుమార్ కుమారుడు వంశ్ (10) దీపావళి రాత్రి 9:45 గంటలకు తన ఇంటి వెలుపల బాణాసంచా కాల్చుతున్నాడు. గ్లాసుపై ఉంచిన బాణసంచా కాల్చుతుండగా అది పేలడంతో ఆముక్కలు వచ్చి బాలుడి మెడకు గుచ్చుకున్నాయి. దాంతో అతడి మెడ నుండి రక్తం కారడం ప్రారంభమైంది. అతని కేకలు కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేశాయి.

పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) సాగర్ జైన్ మాట్లాడుతూ, టిట్రోలోని తన ఇంటి వెలుపల వంశ్ పటాకులు కాలుస్తుండగా, అకస్మాత్తుగా అతని మెడపై బాణాసంచా తగిలి తీవ్ర గాయాలయ్యాయి.

"కుటుంబం వంశ్‌ను స్థానిక ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకువెళ్లింది, అతను వెంటనే మెరుగైన వైద్య సదుపాయం కోసం మరో ఆస్పత్రికి బదిలీ చేయాలని సిఫార్సు చేశాడు. అయితే, ఆసుపత్రికి తరలించే మార్గంలోనే పిల్లవాడు మరణించాడు," అని సాగర్ జైన్ పేర్కొన్నారు.

కుటుంబసభ్యులు మొదట చిన్నారిని స్థానిక వైద్యుని వద్దకు తీసుకెళ్లారు, ఆ తర్వాత అతని పరిస్థితి విషమంగా ఉండటంతో గంగో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. దురదృష్టవశాత్తు, అతను మార్గమధ్యంలో మరణించాడు. పండుగ రోజునే బాలుడు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

అశోక్‌కు వంశ్‌తో సహా ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం ఇటీవల షామ్లీ జిల్లా నుండి పట్టణానికి వచ్చింది. బాలుడి అంత్యక్రియలు శుక్రవారం తీవ్ర విషాద వాతావరణంలో జరిగాయి.

Tags

Next Story