ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు ఢీకొని ఆరుగురు విద్యార్థులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు ఢీకొని ఆరుగురు విద్యార్థులు మృతి
X
డెహ్రాడూన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కళాశాల విద్యార్థులు మరణించారు. వారి కారును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం ఆరుగురు విద్యార్థులు మరణించగా, ఒకరికి గాయాలు అయ్యాయి. ఒఎన్‌జిసి కూడలి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాలేజీ విద్యార్ధులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును ఎదురుగా వస్తు ట్రక్కు ఢీకొనడంతో అది ముక్కలైంది. మృతులంతా ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థులు.

ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుల మృతదేహాలను డూన్ ఆసుపత్రికి, గాయపడిన విద్యార్థిని మహంత్ ఇంద్రేష్ ఆసుపత్రికి తరలించారు. సంబంధిత ఎస్పీ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. మృతులు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థినీ విద్యార్థులు. వారిని గునీత్ (19), కామాక్షి (20), నవ్య గోయల్ (23), రిషబ్ జైన్ (24), కునాల్ కుక్రేజా (23), అతుల్ అగర్వాల్ (24)గా గుర్తించారు. గాయపడిన విద్యార్థి సిద్ధేష్ అగర్వాల్ డెహ్రాడూన్ నివాసి.

Tags

Next Story