Jurala Project : జూరాలకు పోటెత్తిన వరద 20 గేట్లు ఎత్తివేత

జూరాల జలాశయానికి ఇవాళ వరద పోటెత్తింది. రెండు రోజులుగా జూరాల ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు విడుదల చేశారు. దాంతో ఇవాళ ఉదయం జూరాల ప్రాజెక్టుకు 1,35,000 క్యూసెక్కుల ఇన్ వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 1,26,110 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి తోడు విద్యుత్ ఉత్పత్తికి 29,351 క్యూసెక్కులు, ప్రధాన కుడి కాల్వకు 470, కోయిలసాగర్ పథకానికి 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ రెండు గేట్లు ఎత్తివేత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్లో కొనసాగుతుండడంతో ఎన్నెస్పీ అధికారులు రెండు గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రా జెక్ట్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి నీటిమట్టం 590 అడుగులకు చేరింది. జలాశయానికి 65,827 క్యూసెక్కుల ఇనో కొనసాగుతుం డగా, ఔట్ ఫ్లో 60,644 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు ఈ రోజు గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com