హైదరాబాద్‌లో పెరుగుతున్న ఫ్లూ వ్యాధులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు: వైద్యుల సూచనలు

సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు వచ్చినా ప్రజల్లో భయం పట్టుకుంది. చైనాను వణికిస్తున్న HMPV వైరస్ ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. హైదరాబాద్‌లోని వైద్యులు గత రెండు వారాలుగా వైరల్ ఫీవర్‌లు మరియు ఛాతీ ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలను గమనించారు. రోగులందరికి సరైన సమయంలో చికిత్స అందడంతో ఆశించిన విధంగా కోలుకుంటున్నారు. శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్న సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన శీతాకాలపు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు.
చైనాలో HMPV (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) అంటువ్యాధుల గురించి ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ క్లినిక్‌లు మరియు బస్తీ దవాఖానాలు పొడి దగ్గు, శరీర నొప్పులు మరియు జ్వరాలతో సహా ఫ్లూ లాంటి లక్షణాలతో రోగుల సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభించింది. చలికాలంలో ప్రజలు తప్పనిసరిగా ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు.
ప్రజలు వారి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి అని వైద్యులు సూచించారు.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సిఫార్సులు:
సాధారణ చర్యలు:
· రోజంతా గోరువెచ్చని నీటిని తీసుకోండి
· కనీసం 30 నిమిషాలు ప్రాణాయామం మరియు ధ్యానం
· వంటలో పసుపు, జీరా, ధనియాలు, వెల్లుల్లి చేర్చాలని చెబుతున్నారు.
· ఉదయం ఒక టేబుల్ స్పూన్ చవన్‌ప్రాష్ ఇంట్లో పిల్లలు, పెద్దవారితో సహా తీసుకోవాలి.
· మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెస్ చవన్‌ప్రాష్ తీసుకోవాలి
· తులసి, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, శొంఠి వేసి తయారు చేసిన హెర్బల్ టీని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు త్రాగండి.
· గోల్డెన్ మిల్క్ అంటే అర టీస్పూన్ హల్దీ, 150 మి.లీ వేడి పాలలో పౌడర్ రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com